వరిధాన్యం సేకరణకు సిద్ధం కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో వానాకాలం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2, 320-00, సాధారణ రకానికి రూ. 2300-00, సన్నారకం వడ్లకు అదనంగా రూ. 500/- చెల్లిస్తున్నదని తెలిపారు. సన్నరకం ధాన్యం గుర్తించడానికి సన్నరకం ధాన్యం నింపిన బస్తాలకు ఏర్రదారంతో కుట్టి ఎస్ అనే అక్షరం ముద్రించాలన్నారు.