ప్రజాసేవకే నా జీవితం అంకితం: ఎమ్మెల్యే కెవిఆర్

53చూసినవారు
ప్రజాసేవకే నా జీవితం అంకితం: ఎమ్మెల్యే కెవిఆర్
ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ చెప్పారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్