నసురుల్లాబాద్: పోలీస్ సిబ్బందిని సన్మానించిన బీజేపీ నాయకులు

55చూసినవారు
నసురుల్లాబాద్: పోలీస్ సిబ్బందిని సన్మానించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ ఆబిద్ బేగ్, లక్ష్మీనారాయణ, గంగన్న, రమేష్, ఖాజా బాయి, నాగన్న లను శుక్రవారం బీజేపీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి సేవలు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు సున్నం సాయిలు, కార్యదర్శి మేకల రామన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్