నసురుల్లాబాద్: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

51చూసినవారు
నసురుల్లాబాద్: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్ ఫోన్లు, 6 బైకులు, రూ. 1190 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో గత నెల రోజుల్లో నాలుగు పేకాట కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్