ఈనెల 14 న జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, సమయాన్ని, డబ్బులను ఆదా చేసుకోవాలని, కక్షలతో సాధించేది ఏమి లేదన్నారు. రాజీ పడితే ఇద్దరిదీ విజయమన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారన్నారు.