కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులోని ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ఇండ్లమధ్యలో రోడ్డుపై వేపచెట్టు పడింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ వైర్లు తెగి రాత్రి విద్యుత్ నిలిచింది. వార్డు ప్రజలు మాజీ వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి గోదావరికి ఫోన్ చేయడంతో వెంటనే లైన్మెన్ పంపించి విద్యుత్తు పునరుద్దరించారు. మంగళవారం ఉదయం చెట్టు తొలగించారు.