విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

57చూసినవారు
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని డిఆర్డిఏ పిడి చందర్ నాయక్ హెచ్చరించారు. బుధవారం భిక్కనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్లకు ఆయన మెమోలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you