రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

51చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
భిక్కనూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన శేఖర్ సేల్స్ మెన్ గా పనిచేస్తూ కూలెంట్ ఆయిల్ రవాణా చేస్తున్నారు. ఆయన టాటా ఏసీ గూడ్స్ వాహనంలో వెళ్తుండగా జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో శేఖర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. టాటా ఏసీ వాహనం డ్రైవర్ తో పాటు మరో సేల్స్ మెనుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్