పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామంలో మంగళవారం అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు జరిపించారు. గౌడ సంఘం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, సంఘ సభ్యులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా గౌడ సంఘ సభ్యులు కోరుకున్నారు.