కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెడ్మాస్టర్ గంగాకిషన్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని, అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.