సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

68చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏరియా హెల్త్ సూపర్వైజర్ మహమ్మద్ మంజూరు అన్నారు. ఫ్రైడే డ్రై డే సందర్భంగా రాజంపేట మండల కేంద్రంలోని జీపీ ఆవరణలో ప్రజలకు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామన్నారు. పరిసరాల్లో మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత గురించి వివరించామని పేర్కొన్నారు. సెక్రెటరీ అశోక్, ఏఎన్ఎం ఉన్నారు.

సంబంధిత పోస్ట్