కామారెడ్డి: రేషన్లో ప్లాస్టిక్ బియ్యం నిజం కాదు: పౌర సరఫరాల శాఖాధికారి

78చూసినవారు
కామారెడ్డి: రేషన్లో ప్లాస్టిక్ బియ్యం నిజం కాదు: పౌర సరఫరాల శాఖాధికారి
కామారెడ్డి జిల్లాలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కాదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు స్పష్టం చేశారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్