రోడ్డుపై విరిగిపడిన చెట్టును తొలగించిన పోలీస్ సిబ్బంది

82చూసినవారు
రోడ్డుపై విరిగిపడిన చెట్టును తొలగించిన పోలీస్ సిబ్బంది
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం కురిసిన వర్షానికి రోడ్డుపై చెట్టు విరిగి పడింది. దీంతో వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వాహనాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక యువకులతో కలిసి రోడ్డుపైన విరిగి పడిన చెట్టును తొలగించారు. చెట్లను రోడ్డుపై నుండి తొలగించడంలో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ శ్రీనివాస్, బాలు, భాస్కర్ లను ఎస్సై పుష్పరాజ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్