దేవునిపల్లి పాఠశాలలో పోషన్ అభియాన్ కార్యక్రమం

77చూసినవారు
దేవునిపల్లి పాఠశాలలో పోషన్ అభియాన్ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా పోషన్ సంబరాలు అనే అంశం మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. బలమైన విటమిన్లు గల పదార్థాలు తినాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ గంగాకిషన్, అంగన్వాడీ టీచర్లు అనసూయ, సరిత, మానస, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్