కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ అధికారిగా మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఎండిఓగా పని చేసిన రమేష్ పదవి కాలం పూర్తి కావడంతో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో పంచాయతీ మండలాధికారిగా పని చేస్తున్న ప్రవీణ్ కు బాధ్యతలను అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ మనోహర్, మాణిక్యరావు, శ్రీకాంత్ తో పాటు పలు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.