అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేత

81చూసినవారు
అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేత
భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన అంచనూర్ పోచయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. వారు పేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన సంఘ సేవకుడు మిద్దె శాంతికుమార్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అంత్యక్రియల కోసం తన వంతుగా రూ. 10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్