రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: జడ్పీటీసీ

64చూసినవారు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: జడ్పీటీసీ
దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని జడ్పీటీసీ తిర్మల్ గౌడ్ శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కృషితోనే దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని మెడికల్ అధికారి వెంకటేశ్వర్లు తెలుపగా వెంటనే జిల్లా వైద్య అధికారి విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్