పండుగల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

54చూసినవారు
పండుగల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్ పరిధిలో 482 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీరెడ్డి, కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి జేబీఎస్ వరకు, జేబీఎస్ నుంచి నిజామాబాద్ వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్