సదాశివ నగర్ మండలంలో మూడేగామ గ్రామంలో శుక్రవారం శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యము, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డీజే పాటలతో, డప్పులతో, డ్యాన్సులతో కుర్రకారులు అలరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, గ్రామస్తులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.