కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని బ్యాంకు మేనేజర్ రవికుమార్ చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భిక్నూర్ మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. డా. బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలన్నారు.