ఈ నెల 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు 12 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు వ్యాలీలో జరిగే ఆలిండియా ట్రేకింగ్ క్యాంపుకు కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి రామ్ చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి రిషి ఎంపిక అయ్యారని ఎన్సీసి అధికారి ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. హెచ్ఎం సాయిరెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.