కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అత్యవసర ఆపరేషన్ నిమిత్తం 60, 000చెక్కును కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డి. కుమార్ కుటుంబీకులకు అందించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు షబ్బీర్ అలికి, సీఎం కు కృతజ్ఞతసలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని షబ్బీర్ అన్నారు.