
వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా
AP: విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నేత, మండల అధ్యక్షుడు బెహరా భాస్కరరావు పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని అధినేత జగన్కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైసీపీని వీడిన విషయం తెలిసిందే.