కామారెడ్డి పట్టణానికి చెందిన పి. రవి కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా, వెంటనే వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి రవికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం రూ. 2, 00, 000/- ఎల్ఓసి శుక్రవారం అందజేశారు. షబ్బీర్ అలీకి రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.