ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత్వంతోనే నెరవేరుతాయని ప్రజలు విశ్వసించారు.