అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి

66చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారి రజిత మంగళవారం పరిశీలించారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి, బిక్కనూర్, లక్ష్మీదేవునిపల్లి, అంతంపల్లి గ్రామాలను ఆమె సందర్శించారు. ఆయా గ్రామాలలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రెండో విడత విద్యార్థులకు దుస్తుల కుట్టు కేంద్రాన్ని పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్