తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన సాయి, నందివాడ గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి, రామక్రిష్ణ రెడ్డిలు ఇటీవల కానిస్టేబుల్ లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం ఎల్లారెడ్డి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు టీ. ప్రశాంత్ గౌడ్, వేణురెడ్డి, ప్రదీప్ గౌడ్, శ్యామ్ రావు, తదితరులు పాల్గొన్నారు.