ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు: జిల్లా కలెక్టర్

81చూసినవారు
ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు: జిల్లా కలెక్టర్
ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జిల్లాలోని 28 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించారు.

సంబంధిత పోస్ట్