ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల్ జానకంపల్లి ఖుర్దులో గురువారము అటవీ శాఖ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ తన సిబ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు మఫ్టీ లో వెళ్లి పొలంలో నుండి టేకు దుంగలను తరలిస్తున్నరనే సమాచారం మేరకు గొల్ల నారాయణ పొలంను తనిఖీ చేశారు. స్వాధీన పరుచుకున్నటువంటి టేకు దుంగలను ఎల్లారెడ్డి రేంజ్ ఆఫీస్ కు తరలించామన్నారు.