కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు టెన్త్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి రాజు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12. 15 నుంచి 3. 15 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.