జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ సింధుశర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.