పది ఎకరాల లోపుకే రైతు భరోసా ఇవ్వాలి

58చూసినవారు
పది ఎకరాల లోపుకే రైతు భరోసా ఇవ్వాలి
పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా పథకం వర్తింప చేయాలని పలు గ్రామాల రైతులు సూచించారు. శనివారం భిక్కనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం రైతు భరోసాపై రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. పంటలు సాగు చేస్తున్న రైతులను గుర్తించి పది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా పథకం వర్తింప చేయాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్