భిక్కనూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు యువజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు ఆయా గ్రామాలలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాఠశాలల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.