నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భారీ తరహా ప్రాజెక్టు సింగూర్ ప్రాజెక్టులో 33, 871 క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో రావడంతో గురువారం ప్రాజెక్ట్ 4, 6గేట్లు ఎత్తి 19, 106క్యూసెక్కుల నీరు దిగువ మంజీరలోకి విడుదల చేసారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి రానున్నాయి. ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు 3గేట్లు ఎత్తడం గమనార్హం.