

జవాన్లకు కేంద్ర హోమంత్రి అమిత్ షా పరామర్శ (VIDEO)
కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో గాయపడ్డ జవాన్లను ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 21 రోజులపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక్క జవాను ప్రాణాలు కోల్పోకుండానే నక్సలైట్లపై చరిత్రాత్మక విజయం సాధించినట్టు అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.