కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో డీజేను సీజ్ చేసినట్లు ఎస్సై సాయికుమార్ గురువారం తెలిపారు. అంతంపల్లి గ్రామానికి చెందిన డిజె సౌండ్ సిస్టం నిర్వాహకులు జంగంపల్లి గ్రామంలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లి డీజేను సీజ్ చేసి ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.