బీభత్సం సృష్టించిన గాలివాన..

3265చూసినవారు
బీభత్సం సృష్టించిన గాలివాన..
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్త్ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కొయ్యగుట్ట సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు ధ్వంసం అయింది. ఈదురుగాలులకు పెట్రోల్ బంక్ షెడ్ కూలిపోయింది. బొర్లం గ్రామంలో 15 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

సంబంధిత పోస్ట్