కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన ఓ బస్సు బుధవారం వయా బిక్కనూరు మీదుగా జేబీఎస్ కు వెళ్లే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో నిలపకపోవడంతో గ్రామస్తులు బైకులపై ఆ యొక్క బస్సును వెంబడించి అడ్డుకున్నారు. దీంతో అటుగా వెళుతున్న ఏఎస్ఐ జగదీశ్వర్ గ్రామస్తులను సముదాయించి ఆర్టీసీ డ్రైవర్ కు బస్టాండ్ లోకి వెళ్లి తిరిగి రావాలని సూచించడంతో డ్రైవర్ బస్టాండ్ లోకి వెళ్లి తిరిగి జేబీఎస్ కు వెళ్లారు.