కామారెడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల రాస్తారోకోతో స్తంభించిన రాకపోకలు

58చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె 26వ రోజుకు చేరినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని ర్యాలీ, రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్ స్తంభింపచేశారు. ప్రధాన రహదరిపైన ఉద్యోగులు కూర్చొని రాస్తారోకోతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను సముదాయించి రాస్తారోకో విరమింప చేశారు. రోజు రోజుకు ఉద్యోగుల సమ్మె తీవ్రం అవుతుంది. కేజీబీవీలో బోధన అటకెక్కింది.

సంబంధిత పోస్ట్