జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులకు సన్మానం

55చూసినవారు
జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులకు సన్మానం
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు భవాని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి, 35వ వార్డు కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు శాలువాలతో సన్మానించారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం గంగాకిషన్, పెద్దోల్ల శశిధర్ రావు, భాను, గణేష్, విశాల్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్