నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మార్కవట్, భూమి పూజ చేసారు. ప్రస్తుత సీఎం అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి రాజంపేట వరకు తేది 18. 3. 2023న పాదయాత్రలో చిట్యాల రాజమణి, బిక్కునూరి లక్ష్మిలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏండ్లు ఇచ్చారన్నారు.