కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లచ్చపేటలో శుక్రవారం ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ ఉపాధ్యాయుడు రాంసింగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో విద్యార్థులు రాసిన హిందీ కవితలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు నరేందర్, లింగారెడ్డి, శ్రీనివాస్, అఖిల్ హుస్సేన్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.