కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలవడం జరిగిందన్నారు.