ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ. 13 లక్షల నిధులతో నిర్మించనున్న 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ గోదాం అనేకమంది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.