కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండల కేంద్రంలో గల శ్రీరామ మందిరం నిర్మాణం కొరకు ఎస్సై రంజిత్ తన వంతుగా సోమవారం ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం గుడి అర్చకులు మాట్లాడుతూ ఎస్సై రంజిత్ కుటుంబ సభ్యులకు శ్రీరాముని మరియు హనుమంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. గుడి ప్రారంభం తర్వాత ఎస్సై రంజిత్ తనకు తోచిన సహాయం అందిస్తానని తెలిపారు.