కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ

80చూసినవారు
కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, MDK, SRD, VKB, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్