ప్రేమించిన యువతి నిరాకరించిందని ఆత్మహత్య
ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఆరీఫ్ తెలిపిన వివరాలు.. మండలంలోని గౌతమ్ గాంబియా (26) కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. ఓ యువతిని ప్రేమించాడు. ఆమె నిరాకరించిందని మనస్థాపానికి గురై ఖానాపూర్ శివారులో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.