హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. సురేందర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కె. సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పాల్గొన్నారు.