ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయినా తరువాత దోమల నియంత్రణకు ఉపయోగించే ఫాగింగ్ యంత్రం శనివారం సాయంత్రం ఎల్లారెడ్డి పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనిలో కనిపించింది. ఈ మధ్యకాలంలో పట్టణంలో దోమల బెడద పెరగడంతో ఫాగింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. మోటర్ బైక్ పై ఇద్దరు మున్సిపల్ కార్మికులు ఫాగింగ్ యంత్రంతో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. మురికి కాల్వల వద్ద కాలనీ సందుల్లో స్ప్రే చేస్తున్నారు.