కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పెద్ద చెరువు వద్ద సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వేసవి సెలవుల కారణంగా తమ పిల్లలు ఇంట్లోనే ఉంటూ టీవీలు, మొబైల్స్ చూస్తూ అనారోగ్యానికి గురవుతారని, వారికి వ్యాయామం కొరకు తల్లిదండ్రులు పిల్లలను చెరువు వద్దకు తీసుకువచ్చి ఈత నేర్పే విధంగా చూడాలంటున్నారు. ప్రభుత్వం దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.